Breaking News

యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) ప్రాక్టీస్ టెస్ట్-39

UGC-NET-Paper2-Telugu-Mock-test-39-TeluguMaterial.inయూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) మోడల్ పేపర్ ప్రశ్నలు-జవాబులు


Q1. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
సంస్కృతం, లాటిన్, గ్రీన్ భాషల మధ్య జన్యజనక సంబంధం ఉందని నిరూపించిన పండితుడు
a) బ్లూమ్ ఫీల్డ్
b) సర్ విలియం జోన్స్
c) గ్రియర్ సన్
d) హాకెట్

Q2. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
 తెలుగుపదాన్ని మొదట ప్రయోగించింది
a) నన్నయ
b) తిక్కిన
c) ఎఱ్రన
d) నన్నెచోడుడు

Q3. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
 పొసగముత్తెపు సరుల్ పోహళించిన లీల .... అని కవిత్వాన్ని గురించి చెప్పిన కవి
a) అల్లసాని పెద్దన
b) తెనాలి రామకృష్ణుడు
c) పింగళి సూరన
d) రామరాజు భూషణుడు
Q4. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
2015 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత
a) రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
b) కాత్యాయనీ విద్మహే
c) పెద్దిబొట్ల సుబ్బరామయ్య
d) ఓల్గా

Q5. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
తెలంగాణలో బోనాల పండుగ జరిగే మాసం
a) ఆశ్వయుజం
b) ఆషాఢం
c) భాద్రపదం
d) చైత్రం

Q6. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
తోటక రూపక భెదంగా చెప్పబడే కాళిదాసు రచన
a) విక్రమోర్వశీయం
b) అభిజ్ఞాన శాకుంతలమ్
c) మాళవికాగ్ని మిత్రమ్
d) మేఘసందేశం

Q7. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
 క్షత్ర చూడామణి కి మూలమైన తమిళ గ్రంధం
a) శిలప్పదిగారం
b) మణిమేఖలై
c) జీవక చింతామణి
d) పెరియ పురాణం

Q8. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
శ్రీముఖుడు ఏ రాజ్య స్ధాపకుడు?
a) కాకతీయ
b) శాతవాహన
c) పద్మనాయక
d) చాళుక్య

Q9. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు
a) నాజర్
b) చుక్కా సత్తయ్య
c) వై. పి. రాజు
d) ఆదిభట్ల నారాయణదాసు

Q10. క్రింది వాటికి సమాధానాలు గుర్తించండి.
కన్యకాపురాణ కధాగానం చేసే వారు
a) పిచ్చుకుంట్లు
b) వీరముష్టులు
c) విప్రవినోదులు
d) ఆరెకాపులుAnswers:
1. జవాబు: b
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: d
5. జవాబు: b
6. జవాబు: a
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: b
10. జవాబు: bUGC NET వివరాలు:

డిసెంబర్ 02 నుండి 06 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పరీక్ష UGC NET కు సన్నద్ధమవుతున్నవారి కొరకు పేపర్-2 (తెలుగు; కోడ్-27)కు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ ఇవ్వడం జరుగుచున్నది. ఈ ప్రశ్నలు డిఎస్‌సీ, టెట్, గ్రూప్స్, వంటి ఇతర పరీక్షలు రాసేవారికి కూడా ఉపయోగపడతాయి.

UGC NET పరీక్షలో పేపర్-2లో భాగంగా సుమారు 100కి పైగా సబ్జెక్టులు ఉంటాయి. అందులో నుంచి అభ్యర్థుల పీజీ కోర్సును బట్టి తెలుగును ఎంపిక చేసుకోవచ్చు. ఈ జాబితాలో తెలుగు భాషకు సంబంధించిన కోడ్ 27.UGC NET ఉపయోగాలు:


  • పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు/అభ్యర్థులకు UGC NET తప్పనిసరి.
  • యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇది కనీస అర్హత.
  • UGC NETలో JRF (జూనియర్ రీసెర్చ్ ఫెలో) సాధించినవారు పీహెచ్‌డీ చేస్తున్నట్లయితే వారికి నెలకు 41వేల ఫెలోషిప్ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.


UGC NET పరీక్ష గురించి క్లుప్తంగా: ఈ పరీక్ష మొత్తం 100 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ పోస్ట్ గ్రాడ్యువేషన్ సబ్జెక్టునుబట్టి పరీక్షను రాస్తారు. అయితే అందరికీ ఈ పేపర్-1 తప్పనిసరి. పేపర్-2 అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో ఉంటుంది. 


లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుగు మెటీరియల్ కొరకు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు. Click Here. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పక తెలియజేయగలరు.

No comments