Breaking News

యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) ప్రాక్టీస్ టెస్ట్-35

UGC-NET-Paper2-Telugu-Mock-test-35-TeluguMaterial.in



యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) మోడల్ పేపర్ ప్రశ్నలు-జవాబులు


Q1. క్రింది నిర్దేశ (ని) వాక్యాల హేతు (హే) వాక్యాల పరస్పర సంబంధంలోని తప్పోప్పులను గుర్తించండి.

 (ని) అవగాహనాక్షమత్వం కోల్పోని భాషాభగం మాండలికం.
(హే) మాండలికాలు భాషకు పరిపోషకాలు కాబట్టి.
a) (ని), (హే) రెండూ సరైనవి
b) (ని), (హే) రెండూ సరైనవి కావు
c) (ని) సరైనది (హే) సరైనది కాదు
d) (ని) సరైనది కాదు (హే) సరైనది





Q2. క్రింది నిర్దేశ (ని) వాక్యాల హేతు (హే) వాక్యాల పరస్పర సంబంధంలోని తప్పోప్పులను గుర్తించండి.

 (ని) పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా – మనో విశ్లేషణాత్మక నవల.
(హే) మనోవైజ్ఞానికుడు రచించాడు కాబట్టి.
a) (ని), (హే) రెండూ సరైనవి
b) (ని) సరైనది (హే) సరైనది కాదు
c) (ని), (హే) రెండూ సరైనవి కావు
d) (ని) సరైనది కాదు (హే) సరైనది





Q3. క్రింది నిర్దేశ (ని) వాక్యాల హేతు (హే) వాక్యాల పరస్పర సంబంధంలోని తప్పోప్పులను గుర్తించండి.

 (ని) పద్యనాటకాలకు నేడు కాలం చెల్లింది.
(హే) సమర్ధులయిన నటులు లేరు కాబట్టి.
a) (ని) సరికాదు (హే) సరైనది
b) (ని), (హే) రెండూ సరికావు
c) (ని), (హే) రెండూ సరైనవి
d) (ని) సరైనది (హే) సరైనది కాదు





Q4. క్రింది నిర్దేశ (ని) వాక్యాల హేతు (హే) వాక్యాల పరస్పర సంబంధంలోని తప్పోప్పులను గుర్తించండి.

 (ని) భాగవతం తెలుగువాళ్ల అభిమాన గ్రంధం.
(హే) బమ్మెర పోతన రాశాడు కాబట్టి.
a) (ని) సరైనది (హే) సరైనది కాదు
b) (ని), (హే) రెండూ సరైనవి కావు
c) (ని) సరికాదు (హే) సరైనది
d) (ని), (హే) రెండూ సరైనవి





Q5. క్రింది నిర్దేశ (ని) వాక్యాల హేతు (హే) వాక్యాల పరస్పర సంబంధంలోని తప్పోప్పులను గుర్తించండి.

 (ని) జానపద నీతి కధలు – సమాజానికి మార్గదర్శకాలు.
(హే) అవి మానవ నడవడికను ప్రభావితం చేస్తాయి కాబట్టి.
a) (ని) సరైనది కాదు (హే) సరైనది
b) (ని), (హే) రెండూ సరైనవి కావు
c) (ని) సరైనది (హే) సరైనది కాదు
d) (ని), (హే) రెండూ సరైనవి




Q6. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a) ఆకడ, ఆమడ, ఆయెడ, ఆనుడి
b) ఆకడ, ఆనుడి, ఆమడ, ఆయెడ
c) ఆనుడి, ఆకడ, ఆయెడ, ఆమడ
d) ఆమడ, ఆకడ, ఆయెడ, ఆనుడి





Q7. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a) ద్రావిడ భాషలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, గోండీ భాషా వర్ణనాత్మక వ్యాకరణం, అష్టాధ్యాయి వ్యాఖ్యానం
b) గోండీ భాషా వర్ణనాత్మక వ్యాకరణం, ద్రావిడ భాషలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, అష్టాధ్యాయి వ్యాఖ్యానం
c) అష్టాధ్యాయి వ్యాఖ్యానం, గోండీ భాషా వర్ణనాత్మక వ్యాకరణం, ద్రావిడ భాషలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
d) ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, గోండీ భాషా వర్ణనాత్మక వ్యాకరణం, ద్రావిడ భాషలు, అష్టాధ్యాయి వ్యాఖ్యానం





Q8. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a) సుమతీశతకం, పిల్లిశతకం, ఆంధ్రనాయకశతకం, వేమనశతకం
b) సుమతీశతకం, ఆంధ్రనాయకశతకం, పిల్లిశతకం, వేమనశతకం
c) సుమతీశతకం, వేమనశతకం, ఆంధ్రనాయకశతకం, పిల్లిశతకం
d) సుమతీశతకం, ఆంధ్రనాయకశతకం, వేమనశతకం, పిల్లిశతకం





Q9. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a) సుబ్బారావు పాణిగ్రాహి, శివసాగర్, జ్వాలాముఖి, గద్దర్
b) శివసాగర్, సుబ్బారావు పాణిగ్రాహి, జ్వాలాముఖి, గద్దర్
c) సుబ్బారావు పాణిగ్రాహి, శివసాగర్, గద్దర్, జ్వాలాముఖి,
d) శివసాగర్, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్





Q10. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a) రధసప్తమి, వినాయక చవితి, వ్యాస పూర్ణిమ, విజయదశమి
b) వినాయక చవితి, వ్యాస పూర్ణిమ, విజయదశమి, రధసప్తమి
c) వినాయక చవితి, విజయదశమి, వ్యాస పూర్ణిమ, రధసప్తమి
d) వ్యాస పూర్ణిమ, వినాయక చవితి, విజయదశమి, రధసప్తమి



Answers:
1. జవాబు: c
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: b
8. జవాబు: c
9. జవాబు: a
10. జవాబు: d




UGC NET వివరాలు:

డిసెంబర్ 02 నుండి 06 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పరీక్ష UGC NET కు సన్నద్ధమవుతున్నవారి కొరకు పేపర్-2 (తెలుగు; కోడ్-27)కు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ ఇవ్వడం జరుగుచున్నది. ఈ ప్రశ్నలు డిఎస్‌సీ, టెట్, గ్రూప్స్, వంటి ఇతర పరీక్షలు రాసేవారికి కూడా ఉపయోగపడతాయి.

UGC NET పరీక్షలో పేపర్-2లో భాగంగా సుమారు 100కి పైగా సబ్జెక్టులు ఉంటాయి. అందులో నుంచి అభ్యర్థుల పీజీ కోర్సును బట్టి తెలుగును ఎంపిక చేసుకోవచ్చు. ఈ జాబితాలో తెలుగు భాషకు సంబంధించిన కోడ్ 27.



UGC NET ఉపయోగాలు:


  • పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు/అభ్యర్థులకు UGC NET తప్పనిసరి.
  • యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇది కనీస అర్హత.
  • UGC NETలో JRF (జూనియర్ రీసెర్చ్ ఫెలో) సాధించినవారు పీహెచ్‌డీ చేస్తున్నట్లయితే వారికి నెలకు 41వేల ఫెలోషిప్ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.


UGC NET పరీక్ష గురించి క్లుప్తంగా: ఈ పరీక్ష మొత్తం 100 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ పోస్ట్ గ్రాడ్యువేషన్ సబ్జెక్టునుబట్టి పరీక్షను రాస్తారు. అయితే అందరికీ ఈ పేపర్-1 తప్పనిసరి. పేపర్-2 అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో ఉంటుంది. 


లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుగు మెటీరియల్ కొరకు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు. Click Here. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పక తెలియజేయగలరు.

No comments