Breaking News

ఎస్సీ విద్యార్ధుల కుటుంబ ఆదాయ పరిమితి పెంపు

family-income-limit-enhanced-for-sc-students-telugumaterial.in

తెలంగాణలో ప్రీ మెట్రిక్ విద్యార్ధుల ఉపకార వేతనాలు, ప్రభుత్వ వసతి గృహాలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలో చేరే ఎస్సీ విద్యార్ధుల కుటుంబ వార్షికాదాయ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు విద్యార్ధుల కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 65 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 75 వేలు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు. పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలుగా నిర్దేశించింది.

No comments